విలక్షణ పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వరూపం సినిమాలో న్యూక్లియర్ సైన్స్ చదువుకున్న గృహిణి పాత్రలో నటించి ఆకట్టుకున్న పూజాకుమార్, ఆ తరువాత ఉత్తమ విలన్ సినిమాలో కూడా నటించింది. కాస్త గ్యాప్ తరువాత ఆమె తాజాగా రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న గరుడ వేగ చిత్రంలో నటిస్తోంది. విలక్షణమైన పాత్రలో రాజశేఖర్ భార్యగా, ఆరేళ్ల బాబుకు తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాతో ఈమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని చెబుతున్నాడు దర్శకుడు. ప్రస్తుతం బ్యాంకాక్, మలేసియా, పట్టాయా లాంటి దేశాల్లో హాలీవుడ్ స్టైల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో జరుపుకునే షెడ్యూల్‌తో సినిమా పూర్తికానుంది. గ్లామర్ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన పూజాకుమార్ ఈ చిత్రంలో విలక్షణమైన పాత్రలో నటించడం విశేషం.