10న దాసరికి ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇటీవల మృతి చెందారు. ఆయనకు తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఘన నివాళి అర్పించేందుకు అన్ని శాఖలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం చాంబర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ- తెలుగు పరిశ్రమకు పెద్ద దిక్కుగా వున్న గురువు దాసరిగారి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన మృతిపట్ల తెలుగు సినిమా పరిశ్రమలోని అన్ని శాఖలు కలిసి ఘనంగా నివాళులు అర్పించేందుకు నిర్ణయించాము. నిజానికి ఈ కార్యక్రమం ఇంతకుముందే చేయాల్సి వుంది కానీ, పలువురు తారలు షూటింగ్‌ల నిమిత్తం విదేశాల్లో వుండడంవల్ల వాళ్లు వచ్చేవరకూ ఆగాల్సి వచ్చింది. ఈ నెల 10న సాయంత్రం 4 గంటలకు రామానాయుడు కళ్యాణమండపం (్ఫలిం చాంబర్)లో జరపనున్నాము. అలాగే రెండవ ఆదివారం రోజున అన్ని సినిమా షూటింగ్‌లను నిలిపివేస్తున్నాము అని అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ- గురువుగారి మరణం తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సినీ పరిశ్రమ యావత్తూ ఆ రోజు నివాళి అర్పించేందుకు సిద్ధమవుతోంది. తప్పకుండా ఈ కార్యక్రమంలో పరిశ్రమలోని వారందరూ పాల్గొని ఆయనకు ఘన నివాళిని అర్పించాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరశంకర్, నిర్మాత దామోదర ప్రసాద్, నటి హేమ, మద్దినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.