ఇద్దరికీ సక్సెస్ తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ మంచి డాన్సర్. తన ప్రతిభను ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చాడు. అతని డాన్సులు తెరపై చూస్తుంటే ముచ్చటనిపిస్తుంది. అలాగే దర్శకుడు క్రాంతి మాధవ్‌కు, సునీల్‌కు ఈ సినిమా పెద్ద సక్సెస్ తీసుకురావాలి అని దర్శకుడు వి.వి.వినాయక్ చెప్పారు. సునీల్, మియాజార్జ్ జంటగా యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శత్వంలో పరుచూరి కిరీటి రూపొందిస్తున్న చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్‌లో వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ- వినాయక్ ఇచ్చిన సలహాతోనే రెండు మూడు పాయింట్లను ఈ చిత్రంలో కలిపి రూపొందించానని, పోసాని పాత్ర వైవిధ్యంగా వుంటుందని, ఆయన కామెడీ మరింతగా నవ్విస్తుందని ఆయన అన్నారు. సినిమా కథ విన్నప్పటినుంచి సునీల్ అయితేనే పూర్తి న్యాయం చేస్తాడని అనుకున్నామని, అదేవిధంగా వందశాతం ఆ పాత్రలో యాప్ట్ అయ్యారని నిర్మాత కిరీటి చెప్పారు. కామెడీ ఎక్కువగా ఉండడంతో ఈ కథను తాను ఎంపిక చేసుకున్నానని, అలాగే దర్శకుడు క్రాంతి మాధవ్ సినిమా తరువాత మంచి దర్శకుడిగా గుర్తింపు పొందుతాడని నటుడు సునీల్ తెలిపారు. ప్రకాష్‌రాజ్, పోసాని కృష్ణమురళి, ఆశీష్ విద్యార్థి, అలీ, వెనె్నల కిశోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధునందన్, ప్రభాస్ శ్రీను, తా.రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:జీబ్రాన్, కెమెరా:సర్వేష్ మురారి, నిర్మాత:పరుచూరి కిరీటి, దర్శకత్వం:కె.క్రాంతిమాధవ్.