రొటీన్‌కు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్. ఇప్పటికే స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ రేసులో వున్న రకుల్, ప్రస్తుతం మహేష్ సరసన స్పైడర్‌లో నటిస్తోంది. దాంతోపాటు తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తోంది. ప్రస్తుతం తన కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా వుందని చెబుతూనే, నన్ను గ్లామర్ హీరోయిన్‌గానే చూస్తున్నారని, ప్రతి సినిమాలో అలాంటి అవకాశాలే వస్తున్నాయని, ఇలాంటి పాత్రలు చేసి రొటీన్‌గా ఫీల్ అవుతున్నానని చెప్పింది. ఛాలెంజింగ్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని, అలాంటి పాత్రలొస్తే తనని తాను ప్రూవ్ చేసుకుంటానని కూడా చెబుతోంది. ఇప్పటికే గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్‌కి భిన్నమైన పాత్రలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడంలేదట. తమిళంలో కూడా అలాంటి పాత్రలే వస్తున్నాయని చెప్పింది. ఈమధ్యే లిప్‌లాక్‌కు సహితం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రకుల్ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.