మరో బయోపిక్‌లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా మామూలుగా లేదు. జీవిత కథల ఆధారంగా తెరకెక్కించిన సినిమాల్లో చాలావరకూ సంచలనం రేపిన సినిమాలే ఎక్కువ. అందుకని బయోపిక్‌లతో సినిమాలు తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో బయోపిక్ సన్నాహాలు చేస్తున్నాడు ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాల్. ప్రస్తుతం ఆయన దీపికతో పద్మావతి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ప్రముఖ పంజాబీ రచయిత్రి అమృతా ప్రీతమ్ బయోపిక్‌ను తెరకెక్కిస్తాడట. ఈ సినిమా కోసం బాలీవుడ్ గ్లామర్ భామ ప్రియాంకా చోప్రా నటిస్తుందని సమాచారం. ప్రస్తుతం హాలీవుడ్‌లో కూడా హవా చాటిన ప్రియాంకాకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన ఈమె, అటు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్‌లో కూడా సెలెక్టివ్‌గా సినిమాల్ని ఎంచుకుంటోంది. ఇప్పటికే లేడీ బాక్సర్ మేరీకోమ్ జీవిత కథతో తెరకెక్కిన సినిమాలో నటించి ప్రశంసలందుకుంది.