తల్లి పాత్రలో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య హీరోయిన్లు కేవలం గ్లామర్ డాల్స్‌గానే మిగిలిపోకుండా తమకంటూ ప్రత్యేకత సంతరించుకునేలా పాత్రల్ని ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆసక్తిచూపే హీరోయిన్లు ఎక్కువవుతున్నారు. పాత్ర బావుంటే చాలు దేనికైనారెడీ అనే తరహాలో దూసుకుపోతున్నారు. దశాబ్దకాలంపాటు దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన అందాల భామ త్రిష, కొంతగ్యాప్ తరువాత రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె, సెలెక్టివ్‌గా సినిమాల్ని ఎంచుకుంటోంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఆసక్తి చూపిస్తూ ఆ తరహా సినిమాల్లో నటిస్తోంది. త్రిష ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకి చిత్రం భారీ పరాజయం పాలవ్వడంతో ప్రస్తుతం మరో హర్రర్ సినిమాతో భయపెట్టడానికి సిద్ధమైంది. ఈసారి ఏకంగా తల్లి పాత్రలో నటించేందుకూ సిద్ధమైందట. ప్రస్తుతం అరవింద్ స్వామితో కలిసి త్రిష నటిస్తున్న సాతురంగ వెట్టై సినిమాలో నాలుగేళ్ళ పాపకు తల్లిగా నటిస్తూ షాక్ ఇవ్వనుంది. ఈ సినిమాలో త్రిష పాత్ర హైలెట్ కానుందని, మళ్లీ ఈ సినిమాతో తన క్రేజ్ ఇంకాస్త పెరుగుతుందని నమ్మకంతో ఉంది.