16న మరకతమణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాణి జంటగా రిషి మీడియా, శ్రీచక్ర ఇన్నోవేషన్స్ పతాకంపై ఎ.ఆర్.శరవణన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మరకతమణి’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 16న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శరవణన్ మాట్లాడుతూ- మరకతమణి సినిమా కథ యూనివర్సల్ పాయింట్‌తో వుంటుందని, అందుకే బైలింగ్వుల్‌గా రూపొందించామని, ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. ఐదు పాటలతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతి పాటా డిఫరెంట్‌గా వుంటుందని, ఆడియో ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిందని, సినిమా కూడా హిట్ అవుతుందని సంగీత దర్శకుడు దిబు నైనస్ థామస్ తెలిపారు. పూర్తిగా స్క్రీన్‌ప్లే బేస్డ్ చిత్రంగా రూపొందిన మరకతమణిగా ఓ ఐదు పాత్రలను ఆధారం చేసుకొని సినిమా సాగుతుందని, ఇప్పటివరకు సీరియస్ పాత్రలు చేసిన తాను, తొలిసారిగా కామెడీ కూడా చేశానని, సినిమా కథలో సస్పెన్స్ చివరవరకూ సాగుతూనే వుంటుందని అన్నారు.