స్నేహితులంటే వీళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరజ్, రవీంద్రతేజ, సోనియా, ఫరా హీరో హీరోయిన్లుగా జిఎల్‌బి శ్రీనివాస్ దర్శకత్వంలో అనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ముళ్లగూరు అనంతరాముడు, ముళ్లగూరు రమేష్‌నాయుడు నిర్మిస్తున్న ‘టూ ఫ్రెండ్స్’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే గాంధీ క్లాప్‌నివ్వగా, నటుడు విజయ్‌చందర్ స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సాయిప్రకాష్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఏడాదిపాటు కష్టపడి కథను తయారుచేశాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ విషయంలో నిర్మాత సహకారముంది. ఇప్పటికే సాంగ్స్ రికార్డింగ్ పూర్తిచేశాం. యూత్‌కు సంబంధించిన అంశాలతో రూపొందుతున్న కథ ఇది. నేటినుండి నాలుగు రోజులపాటు షూటింగ్ జరిపి ఆ తరువాత హైదరాబాద్, బెంగుళూరు తదితర ప్రాంతాల్లో చిత్రీకరించి మూడు నెలల్లో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఘటికాచలం మాట్లాడుతూ నిర్మాత అనంతరాముడు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. ఉత్తమ రైతుగా రాష్టప్రతి అవార్డు అందుకున్నాడు. ఇంజనీరింగ్ కాలేజీ స్థాపకుడు. ఆయనకు సినిమాలంటే ఆసక్తి ఉండడంతో ఈ రంగంలోకి రావడం జరిగింది. మంచి కథతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రేమకంటే స్నేహం గొప్పదని చాటే చిత్రమిదన్నారు. నిర్మాత అనంతరాముడు మాట్లాడుతూ రైతుగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నాను. ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించి మంచి విద్యను అందిస్తున్నాను. అలాగే మంచి చిత్రాలను నిర్మించాలనే సంకల్పంతో పరిశ్రమకు రావడం జరిగింది అన్నారు.