శివ కార్తికేయన్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో టాప్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ సమంత వ్యవహారం జోరుమీదుంది. ఇప్పటికే రామ్‌చరణ్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రంగస్థలం-1985 చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సమంత అక్టోబర్‌లో వివాహానికి సిద్ధమైంది. యువ నటుడు నాగచైతన్యతో ఇదివరకే నిశ్చితార్ధం జరుపుకున్న ఈమె అక్టోబర్‌లో పెళ్లిచేసుకోడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దాంతో వీలైనంత త్వరగా సినిమాల్ని పూర్తిచేయాలనే ఆలోచనలో ఉంది. ఇటీవల చరణ్ సినిమాకోసం బాగానే కష్టపడుతున్న సమంత చేతిలో మూడు సినిమాలున్నాయి. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే విజయ్, విశాల్ సినిమాల్లో నటిస్తున్న సమంత తాజాగా శివకార్తికేయన్ సరసన నటించేందుకు ఓకే చెప్పడం విశేషం. ఈనెల 16నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. పెళ్లికోసం షూటింగ్‌లకు దూరమవుతానని అనుకుందో ఏమో అందుకే వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది.