చందమామ రావే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్‌చంద్ర, ప్రియల్‌గోర్ జంటగా లైఫ్ కార్పొరేషన్, ఇటాలియన్ ఆఫ్‌ది ఈస్ట్ ఫిలిమ్ కార్పొరేషన్ పతాకాలపై ధరమ్, రక్ష దర్శకత్వంలో కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బల సంయుక్తంగా రూపొందించిన చిత్రం చందమామ రావే. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కిరణ్ జక్కంశెట్టి మాట్లాడుతూ.. ప్రపంచంలో కవల సోదరులు దర్శకత్వం వహించిన తొలి సినిమాగా ఈ చిత్రం రికార్డుకెక్కుతుందని, వారిద్దరూ సినిమాను అద్భుతంగా రూపొందించారని తెలిపారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయని, పెక్యులర్ లవ్ స్టోరీతో లవ్‌కు, లైఫ్‌కు టైమింగ్ చాలా అవసరమని చెప్పే వెరైటీ కథనంతో ఈ చిత్రం డిఫరెంట్‌గా వచ్చిందని అన్నారు. ఎమోషన్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ సినిమాలో హిమాలయాలు, గ్యాంగ్‌టక్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, దేవదాస్‌ని పార్వతి ఒక్కసారి వదిలేస్తేనే ఆయన పరిస్థితి అలా తయారైతే.. ఒకే అమ్మాయిని హీరో మూడుసార్లు వదిలేస్తే ఇంకెలా ఉంటుంది అన్న కథనమే ఈ సినిమాలో ప్రధానమైన పాయింట్ అని వారు తెలిపారు. జూన్ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం: ధరమ్, రక్ష.