ఈనెలలోనే రా.. రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్ కథానాయకుడుగా నాజియా కథానాయికగా విజి చెర్రీస్ విజన్స్ పతాకంపై విజయ్ రూపొందించిన చిత్రం రా..రా. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెలలోనే విడుదలకు సిద్ధవౌతోంది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ హాస్యంతో కూడిన హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందిందని, మనుషులకు, దెయ్యాలకు మధ్య జరిగే సరదా సరదా ఆటలు ప్రేక్షకుడిని వినోదాలలో ముంచుతాయని, హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో తొలిసారిగా ఈ చిత్రంలో నటిస్తున్నానని, అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఇటీవల విడుదలైన మెగా స్టార్ చిరంజీవి విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోందని, ఆడియో వేడుకను విభిన్నమైన రీతిలో జరపనున్నామని నిర్మాత విజయ్ తెలిపారు. గిరిబాబు, సీత, అలీ, రఘుబాబు, పోసాని కృష్ణమురళీ, పృథ్వి, జీవా, చంద్రకాంత్, రఘు, హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, కెమెరా: పూర్ణ, ఫైట్స్: గిల్లే శేఖర్, ఎడిటింగ్: శంకర్, నిర్మాత: విజయ్, దర్శకత్వం: విజి చరిష్ యూనిట్.