సుకుమార్‌తో అఖిల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది అక్కినేని అభిమానులను అఖిల్ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు అక్కినేని అఖిల్. వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం భారీ అంచనాలమధ్య విడుదలై పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు అఖిల్‌ను హీరోగా నిలబెట్టడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. అఖిల్ రెండవ సినిమా ఏ దర్శకుడుతో చేస్తాడనే విషయంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం, అఖిల్ కోసం క్రేజీ దర్శకుడు సుకుమార్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను రూపొందించిన సుకుమార్‌తో సినిమా చేయడానికి నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని, ఈ సినిమా చేస్తే అఖిల్‌కు ఓవర్‌సీస్‌లో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుందని నాగార్జున భావిస్తున్నాడట. ఇదివరకే నాగచైతన్యతో ‘100 పర్సెంట్ లవ్’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు సుకుమార్. త్వరలోనే వీరి సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం వుంది.