దీపావళికే విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్ 25వ చిత్రం జోరుగా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదివరకే ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. కీర్తి సురేష్, అను ఇమాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఈ చిత్రాన్ని దసరాకు కాకుండా దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. దానికి కారణం దసరా సందర్భంగా మహేష్ ‘స్పైడర్’, బాలకృష్ణ ‘పైసావసూల్’, ఎన్టీఆర్ ‘జైలవకుశ’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. పవన్ సినిమా కూడా ముందు సెప్టెంబర్ 27న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ పెద్ద సినిమాలమధ్య పోటీ ఎందుకనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 12న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారట. పవన్ కూడా అదే నిర్ణయంతో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు.