1050 కేంద్రాల్లో ఫిఫ్టీడేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు విశ్వవ్యాప్తం చేసిన సినిమాగా సత్తాచాటింది ‘బాహుబలి’. రాజవౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1050 కేంద్రాలలో 50 రోజులు పూర్తిచేసుకొని ఏ భారతీయ చిత్రానికి సాధ్యంకాని ఆల్ టైం రికార్డుని సృష్టించింది. ఇప్పటికే 1700 కోట్ల రూపాయలు వసూలు చేసిన మొదటి చిత్రంగా ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. బాహుబలి మొదటిభాగం కంటే బాహుబలి-2 ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 280 స్క్రీన్‌లలో 50 రోజులు పూర్తి చేసుకుని సత్తాచాటింది. మహారాష్ట్ర 179, కేరళ 102, తమిళనాడు 120, కర్నాటక 54, ఓవర్సీస్ 25 తదితర సెంటర్లను కలుపుకొని వెయ్యికిపైగా థియేటర్‌లలో అర్థశతదినోత్సవాన్ని పూర్తిచేసుకున్న మొదటి చిత్రంగా రికార్డులు సృష్టించింది. దాంతోపాటు ప్రతిష్టాత్మకమైన కేన్స్, తదితర అంతర్జాతీయ ఉత్సవాల్లో సినిమాకు బ్రహ్మరథం పట్టారు. మాస్కో ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ప్రభాస్, రానాల నటన, శివగామి, దేవసేనల అద్భుత ప్రతిభతో విడుదలైన ప్రతి చోటా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇంకా ఈ సినిమా పలు కేంద్రాల్లో ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతూనే వుంది.