నవీన్ యాక్షన్ థ్రిల్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్ హీరోగా కృష్ణప్రసాద్ దర్శకత్వంలో ప్రవీణ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘డేర్’. ఈ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- ‘అన్ని రకాల కమర్షియల్ విలువలతో తెరకెక్కిన చిత్రమిది. పాటలు, కామెడీ హైలెట్‌గా నిలుస్తాయి.
చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాటలను విడుదల చేసి చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని అన్నారు. దర్శకుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ- ‘పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిదని, హీరో నవీన్ కొత్తవాడైనా అద్భుతంగా నటించాడని, జీవా, సుమన్‌శెట్టిల పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అన్నారు.
నవీన్ మాట్లాడుతూ- హీరోగా నాకు ఇది తొలి చిత్రమని, మంచి కథతో ఈ సినిమా చేసే మంచి అవకాశం ఇచ్చారని అన్నారు. ఈ చిత్రానికి మాటలు:రాఘవ, ఎడిటింగ్:పాపారావు, కమెరా:దంతు వెంకట్, సంగీతం:జి.ఆర్.నరేన్, నిర్మాత:ఎస్.రామారావు, దర్శకత్వం:కె.కృష్ణ ప్రసాద్.