నేనే రాజు నేనే మంత్రి రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’పై ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి ఘనవిజయం తర్వాత రానా చేసిన మొదటి సినిమా కావడంతో అందరూ ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. తాజాగా ఈసినిమా విడుదల తేదీని నిర్ణయించారు నిర్మాతలు. ఆగస్టు 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఒక సాధారణ యువకుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగాడనే ఆసక్తికరమైన పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా రానా కెరీర్‌లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత తేజ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా సురేష్ బాబు, భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు.