ఐటెం సాంగ్‌లో అనుష్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ విడుదలకు సిద్ధం అయింది. దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రానికి ‘్భరత్ అను నేను’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన అసెంబ్లీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక సాంగ్‌ను ప్లాన్ చేశాడట కొరటాల. జనతా గ్యారేజ్‌లో కాజల్‌తో చేసిన సాంగ్ సూపర్‌హిట్ కావడంతో అలాంటి సాంగ్‌ను పాపులర్ హీరోయిన్‌తో చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సాంగ్‌లో గ్లామర్ భామ అనుష్క నర్తించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనుష్కతో మంతనాలు జరుపుతున్నారని టాక్. గతంలో అనుష్క చిరంజీవి స్టాలిన్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు మరో సాంగ్‌తో రానుంది. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.