12న రానున్న కాకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్పిత క్రియేషన్స్ పతాకంపై అశోక్‌కుమార్, కిరణ్, మేఘశ్రీ ప్రధాన తారాగణంగా మనోన్ ఎం. దర్శకత్వంలో పత్తికొండ కిరణ్ రూపొందించిన చిత్రం ‘కాకి’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, కాకి చిత్రంలో కథ డిఫరెంట్‌గా ఉంటుందని, అందుకు తగిన విధంగానే ఆ పేరును నిర్ణయించామని తెలిపారు. వైజాగ్, హైదరాబాద్, పాండిచ్చేరిలలో సుమారు 40 రోజులపాటు షూటింగ్ చేసిన ఈ చిత్రం తొలి కాపీ అందరికీ నచ్చిందని, సెన్సార్ పూర్తిచేసుకుని ఏ సర్ట్ఫికెట్ పొందిందని తెలిపారు. మొదటి భాగమంతా కామెడీతో సాగిన ఈ చిత్రం రెండో భాగంలో హారర్ థ్రిల్లర్‌గా సస్పెన్స్‌తో సాగుతుందని, ఇప్పుడొస్తున్న హారర్ చిత్రాలకు భిన్నంగా కాకి చిత్రం ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ, ఎపి ఓవర్సీస్‌లలో 12న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామని అన్నారు. అశోక్‌కుమార్, జయసుధ, నాజర్, యువీనా, యోగిబాబు, రమేష్‌పండిట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శరవణన్ నటరాజన్, సంగీతం: అమ్రిత్, మాటలు: వినోద్‌శివ, పాటలు: భాస్కరభట్ల, ఎడిటింగ్: శశికుమార్, కథ: రోనాల్డ్ రాజ్ ఎస్ విలియమ్స్, నిర్మాత: కిరణ్ పత్తికొండ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మనోన్ ఎం.