మహానటి కోసం హాలీవుడ్ కెమెరామెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగఅశ్విన్ తెరకెక్కిస్తున్న బయోపిక్ ‘మహానటి’. స్వప్న సినిమా పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, మరొక పాత్రలో సమంత నటిస్తున్నారు. హీరో దుల్కర్ సల్మాన్ సావిత్ర భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండడం విశేషం. కంటెంట్ పరంగానే కాక క్వాలిటీ పరంగానూ మంచి ఔట్‌పుట్ కోసం సినిమా యూనిట్ ప్రయత్నిస్తోంది. అందుకోసం హాలీవుడ్ కెమెరామెన్ డాని సంచెజ్ లోపెజ్‌ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- పలు అంతర్జాతీయ యాడ్స్, సంగీత ఆల్బమ్స్, డాక్యుమెంటరీలను చిత్రీకరించిన ప్రముఖ హాలీవుడ్ కెమెరా టెక్నీషియన్ డానీ సంచెజ్ లోపెజ్ లాంటి ప్రతిభగల సాంకేతిక నిపుణుడు మహానటి చిత్రానికి పనిచేస్తుండడం గర్వంగా వుందని తెలిపారు. సినిమా అంతా రియలిస్టిక్‌గా వుండడానికి కెమెరామెన్ పనితనం బాగా ఉపయోగపడుతుందన్న నమ్మకం వుందని, ప్రేక్షకులకు ఓ వైవిధ్యమైన అనుభవాన్ని అందించడానికి తమ ప్రయత్నమని తెలిపారు.