విడుదలకు సిద్ధమైన రా.రా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో శ్రీకాంత్ హీరోగా, నాజియా నాయికగా నటిస్తున్న చిత్రం రా.రా.. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక గీతాన్ని రేడియో మిర్చి కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్‌తోపాటు చిత్ర సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్, నిర్మాత విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ గీతాన్ని భాషాశ్రీ రచించగా, సంగీత దర్శకునితోపాటు గాయని శ్రావణభార్గవి ఆలపించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ- ‘ఇది హాస్యంతో కూడిన హర్రర్ థ్రిల్లర్ చిత్రం. ఈ గీతానికి శ్రోతల నుంచి మంచి స్పందన లభించడం ఎంతో ఆనందంగా ఉంద’ని తెలిపారు. సినిమా గురించి శ్రోతలతో మాట్లాడటం ఆనందం కలిగించిందన్నారు. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింపజేస్తాయని, హారర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం తొలిసారి చేస్తున్నానని, ఇది ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నానని అన్నారు. నిర్మాత విజయ్ మాట్లాడుతూ, ‘ఈ రోజు ఒక గీతాన్ని విడుదల చేశామని, ఇతర గీతాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తామని, ప్రీ రిలీజ్ వేడుకను త్వరలో విభిన్న రీతిలో హైదరాబాద్‌లో జరుపుతామ’ని అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, ఈనెలలోనే దీన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.