ప్రేమలో పడింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య సరసన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మంజిమా మోహన్‌కు ఆ సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. అందం, అభినయం కలగలిసిన ఈమెకు ఆ తర్వాత పలు అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా మారిన మంజిమ జోరు ప్రేమాయణంలో ఉందంటూ కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె అతగాడితో కలిసి షికార్లు చేస్తోందట. పార్టీలు, పబ్‌లంటూ ఇద్దరూ కలిసి తిరుగుతుండడంతో ఈ వార్తలకు ఊపొచ్చింది. కెరీర్ మొదలుపెట్టిన తక్కువ సమయంలోనే మంజిమ ఇలా ప్రేమాయణంలో పడిపోవడంతో అందరూ షాకవుతున్నారు. ప్రస్తుతం మంజిమ సినిమాల విషయంలో కొన్ని కండిషన్లు కూడా పెట్టిందట. బికినీలు, లిప్‌లాక్‌లు చేయనని, తెరపై రొమాన్స్ సన్నివేశాల్లో కూడా నటించనని గట్టిగానే చెబుతోంది. దాంతో ఆమెకు వచ్చిన అవకాశాలు వెనుతిరుగుతున్నాయి. హీరోయిన్‌గా కెరీర్ ఊపులో ఉన్న సమయంలో ఇలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈమెకు అవకాశాలు తగ్గిపోతాయని సన్నిహితులు చెబుతున్నారట.