న్యూజిలాండ్‌లో ఏడడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిజిత్ హీరోగా మోక్షా మూవీస్ పతాకంపై సంతోష్ తుక్కాపురం దర్శకత్వంలో వెంకటరమణ, తాన్యామెహ్రా నిర్మిస్తున్న ‘ఏడడుగులు’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహుర్త సన్నివేశానికి తెలంగాణ డిప్యుటీ స్పీకర్ పద్మ దేవేందర్‌రెడ్డి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇదొక భిన్నమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమని, న్యూజిలాండ్‌లో షూటింగ్ జరపనున్నామని, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణన్ సంగీతం అందిస్తున్నారని, దాదాపు న్యూజిలాండ్‌లోనే చిత్రీకరణ పూర్తి చేస్తామని అన్నారు. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలుపెట్టి నవంబర్ వరకు పూర్తి చేస్తామని చెప్పారు. దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ ఇదొక న్యూజిలాండ్ బేస్డ్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ, అందమైన దృశ్య కావ్యంగా తెరకెక్కించనున్నామని అన్నారు. హీరో అభిజిత్ మాట్లాడుతూ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత ఈ చిత్రంతో నాకు అంత మంచి పేరు వస్తుందని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.ఎమ్.రాధాకృష్ణన్, కెమెరా:్ధరజ్ తమ్మినేని, నిర్మాతలు: వెంకటరమణ మెట్ట, తామ్యా మెహ్రా, దర్శకత్వం: సంతోష్ తుక్కాపురం.