చాన్స్ కొట్టేసింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలీవుడ్‌లో అతి పెద్ద బడ్జెట్‌తో భారీ ప్రాజెక్టును మొదలుపెట్టారు. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సంఘమిత్ర’ చిత్రానికి సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఇందులో టైటిల్ రోల్ కోసం మొదట శ్రుతి హాసన్‌ను ఎంపిక చేసారు. సినిమా కోసం ట్రైనింగ్ ఇచ్చి పదిరోజులపాటు షూటింగ్ జరిగిన తరువాత శ్రుతి ఈ ప్రాజెక్టునుంచి తప్పుకుంది. దాంతో లీడ్ రోల్‌లో ఏ హీరోయిన్ నటిస్తుందా అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికి అనుష్క, నయనతార, దీపిక వంటి హీరోయిన్ల పేరు వినిపించాయి. ఇంకా హీరోయిన్ కోసం అనే్వషణ జరుగుతునే ఉంది. ఇప్పుడు కొత్తగా హన్సిక పేరు వినిపిస్తోంది. పైగా ఇదివరకే హన్సికతో సుందర్ సినిమా తీయడంతో వీరద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హన్సికతో ఈ పాత్రను చేయించాలని సుందర్ ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం గ్లామర్ పాత్రలకే పరిమితమైన హన్సికకు ఈ పాత్ర మరో టర్నింగ్ పాయింట్ కాగలదు. నిజానికి మొదట్లో హన్సికను వద్దని చెప్పారట నిర్మాతలు. కానీ ఇప్పుడు ఆమె తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి ‘సంఘమిత్ర’గా హన్సిక నటించడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.