ఆగస్టులో ఆక్సిజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్ కథానాయకుడుగా ఎఎన్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆక్సిజన్. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది. రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలుగా గోపీచంద్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య రూపొందించారు. త్వరలో ఆడియో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 18న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎస్ ఐశ్వర్య మాట్లాడారు. ‘పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. గోపీచంద్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ముంబయి, గోవా, సిక్కిం, చెన్నైలలో నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా రూపొందించాం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆక్సిజన్ ఆడియో తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. జ్యోతి కృష్ణ టేకింగ్ స్టాండర్డ్స్ విషయం సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులకు అర్ధమవుతుంది. త్వరలోనే యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను విడుదల చేసి, ఆగస్టు 18న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని ఐశ్వర్య తెలిపారు.