మహిళల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈ లోకానికి ఎవరినైనా తొలుత పరిచయం చేసేది అమ్మ. మహిళల వల్లనే జీవితం సాగుతుంది. ఈ ప్రయాణంలో స్ర్తి పాత్ర గొప్పది. అలాంటి స్ర్తిమూర్తికోసం ఓ గీతం ఉండాలని ఆలోచించడం, అలా ఆలోచించి శంకర్ మహదేవన్ లాంటి ఓ అద్భుతమైన గాయకుడితో పాడించడం మెచ్చదగిన ప్రయత్నం’ అని దర్శకుడు వివేక్ తెలిపారు. శంకర్ మహదేవన్ ఆలాపనలో సుభాష్ సంగీతం అందించగా మహిళను కీర్తిస్తూ పాడిన పాటను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో గురువారం ఉదయం ఆయన విడుదల చేశారు. రాహుల్ నిర్మాతగా వ్యవహరించిన ఈ పాట మ్యాడ్ ఓవర్ ఫిలింస్ పతాకంపై విడుదలైంది. సుభాష్ సంగీతం అందించగా, థురాజ్ సాహిత్యం అందించాడు. కెమెరా అరవింద్ నిర్వహించారు. ఈ పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి, సుభాష్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ మాట్లాడుతూ- అనేకమంది ప్రయత్నంతో ఈ మంచి పాట వచ్చిందని, వాస్తవానికి తొలుత మహిళలపై యాడ్ షూట్ చేయాలనుకున్నామని, దానినే పాటగా మార్చి ఇలా అందించామని, పాటే కదా అని లైట్‌గా తీసుకోలేదని, పది రోజుల్లో షూటింగ్ పూర్తిచేశామని తెలిపారు. మహిళా శక్తిని ప్రోత్సహించాలని తామెప్పుడూ చెబుతామని, ప్రస్తుతం తాము రూపొందిస్తున్న చిత్రంలోనూ మహిళా ప్రాధాన్యతను ప్రోత్సహిస్తున్నానని నిర్మాత రాజ్ కందుకూరి తెలిపారు. ఆడవాళ్ళు ఎంతో శ్రమిస్తారని, వారిని గౌరవించడం చాలా ముఖ్యమని, జాతీయ గీతానికి ఎంత గౌరవముందో ఈ మహిళా గీతానికి అంతే గౌరవం ఇవ్వాలని దర్శకుడు సుభాష్ అన్నారు.