రిఫరెన్స్ కోసం ఆ సినిమా చూశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగపతిబాబు ప్రధాన పాత్రలో వాసు పరిమి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పటేల్ సర్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది తాన్యాహోప్. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా తాన్యా చెప్పిన విశేషాలు..
ఫ్యామిలీ డ్రామా
ఈ సినిమా ట్రైలర్‌లో చూపించినట్లు యాక్షన్ థ్రిల్లర్‌గానే కాదు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడుకున్న డ్రామా ఉంటుంది. ఇందులో నేను పోలీసు అధికారిగా కనిపిస్తాను. యారోగెంట్, అగ్రెసివ్‌గా నా పాత్ర సాగుతుంది. మొదటిసారి ఈ తరహా పాత్ర చేయడం థ్రిల్లింగ్‌గా వుంది.
పరిశోధన
ఇందులో హత్యల్ని పరిశోధించే అధికారిగా కన్పిస్తాను. హత్యల వెనుకనున్న కారణాలేమిటి? అనే దిశగా నా పాత్ర సాగుతుంది. సిన్సియర్ పోలీసు అధికారిగా చేశాను కాబట్టి నాకు చిత్రంలో పాటలేమీ లేవు. ఈ సినిమాలో జగపతిబాబుతో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఒక తపనతో నటించడం ఎలాగో ఆయనను చూసి నేర్చుకున్నాను.
జనతా గ్యారేజీ చూశా..
ఈ సినిమాలోని నా పాత్రకోసం జనతాగ్యారేజ్ సినిమా చూడమని చెప్పారు. అందులో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీ ఎలా వుంటుందో గమనించమని దర్శకుడు చెప్పాడు. అలాగే చూశా. తప్పకుండా ఈ సినిమా నా కెరీర్‌కు మంచి హెల్ప్ అవుతుంది. నాకు చిన్నప్పటినుంచి సినిమాలంటే ఆసక్తి. దాంతోపాటు రాజకీయాలంటే కూడా. నేను బెంగళూరులో పొలిటికల్ సైన్స్ చదివాను. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్తానేమో.

-శ్రీ