రేంజ్ పెంచేశాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు హీరో నాని. నాచురల్ స్టార్‌గా ఇమేజ్ తెచ్చుకున్న నాని డబుల్ హ్యాట్రిక్‌ను అందుకున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘నిన్ను కోరి’ చిత్రం మంచి విజయాన్ని అందుకుని భారీ వసూళ్ల దిశగా అడుగులేస్తోంది. నాని కెరీర్‌లో అతి ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. వరుస విజయాలతో బిజీగా వున్న నానితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. నిన్నుకోరి సినిమాతో బిజినెస్ పరంగా తన రేంజ్‌ని అమాంతం పెంచుకున్న నాని, రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్టు వార్తలొస్తున్నాయి. నాని నటించిన నేను లోకల్ సినిమా సంచలన విజయం సాధించడంతో బయ్యర్లకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. దాంతో తన తదుపరి సినిమాల విషయంలో తన రెమ్యూనరేషన్ పెంచాడట. నానితో సినిమా అంటే 15 కోట్ల వరకూ వుండే మార్కెట్ ఇప్పుడు 30 కోట్లకు చేరడంతో ఆ దిశగా నాని కూడా అడుగులేస్తున్నాడట. టాలీవుడ్ టాప్ హీరోల రేస్‌లో చేరిపోయిన నాని, ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే దిల్‌రాజు నిర్మిస్తున్న ఎంసిఏ సినిమాతోపాటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మరో చిత్రం, దాంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో మిలటరీ నేపథ్యంలో మరో చిత్రం చేయనున్నాడు.