ఉయ్యాలవాడలో.. ఉపేంద్ర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్రను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉపేంద్ర అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారో లేదో మాత్రం ప్రకటించాల్సి వుంది. గతంలో అల్లు అర్జున్‌తో ఉపేంద్ర నటించిన సంగతి తెలిసిందే. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఉపేంద్ర నటించిన పాత్ర సినిమాకు కీలకంగా మారింది. ప్రస్తుతం ఉయ్యాలవాడలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోందట. ఈ చిత్రంలో విలన్‌గా అల్లు అర్జున్ కూడా నటిస్తున్నాడన్న వార్త టాలీవుడ్‌లో వినిపిస్తుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చేనెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలుస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే!