దసరాకు స్పైడర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. క్రేజీ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి జూన్ 23న విడుదలవలసిన ఈ చిత్రం సినిమా షూటింగ్ పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. గతంలో టీజర్, ఫస్ట్‌లుక్ విషయంలో పలుమార్లు వాయిదాలు పడ్డ విషయం తెలిసిందే. దాంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే, ఈసారి విడుదల తేదీ విషయంలో పక్కాగా వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే శరవేగంగా పనుల్ని చక్కబెడుతున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 27న విడుదలకు ప్లాన్ చేశారు. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తారట. బాహుబలి ఎఫెక్ట్‌తో సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగింది. మరోవైపు సినిమాకు సంబంధించిన బిజినెస్ విషయంలో సంచలనాలు రేపుతోంది. ఇప్పటికే అన్ని ఏరియాలకు సంబంధించిన హక్కులు ఫ్యాన్సీ ఆఫర్‌లతో బయ్యర్లు స్వంతం చేసుకున్నారట. బాహుబలి తదుపరి రికార్డు స్పైడర్‌కే దక్కడం విశేషం. హైటెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న స్పైడర్ ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి!