జనవరిలో దండకారణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా విప్లవ చిత్రాల కథానాయకుడు ఆర్.నారాయణమూర్తి ప్రధాన పాత్రలో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దండకారణ్యం’. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై రూపొందించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ, ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందని, జనవరిలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్, గనుల తవ్వకాలకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నందువల్ల ఆదివాసీల మనుగడే కష్టమైపోయిందని, వారి కష్టాలను కళ్ళముందుకుతెస్తూ, ఆదివాసీల హక్కుల గురించి తెలుపుతూ తీసిన ప్రయత్నమే ‘దండకారణ్యం’ సినిమా అని ఆయన అన్నారు. గద్దర్, వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాటలు అందరినీ అలరిస్తాయని, ప్రభుత్వ విధానాలవల్ల ఇక్కడ ఉన్న సంపద ప్రైవేట్‌పరం అవుతుందన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, ఎడిటింగ్, కొరియోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం: నారాయణమూర్తి.