అందరినీ ఫిదా చేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది ఫిదా చిత్రం విజయం. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిదా వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, నాగబాబు, నారాయణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ- 3్ఫదా లాంటి మంచి సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు పరిశ్రమ తరఫున ధన్యవాదాలు. మొదటి ఆటకే సూపర్‌హిట్ అన్నారు. ఇప్పుడు ఏ సినిమా అయినా ఫస్ట్ షోకే తెలిసిపోతుంది. పల్లెటూరి వాతావరణంలో నేటివిటీ మిస్ అవ్వకుండా అద్భుతంగా తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల. సినిమా చూసిన ప్రతిఒక్కరూ ఆనందంతో బయటికి వస్తున్నారు. శేఖర్ కమ్ముల కెరీర్‌లో ఫిదా బెస్ట్ సక్సెస్ అని నా నమ్మకం. ఈమధ్య వరుసగా దిల్‌రాజు విజయాలు అందుకుంటున్నాడు. ఆయ న్ను చూస్తే ఈర్ష్య కలుగుతోంది. వరుణ్ ఈ సినిమాలో చక్కగా నటించాడు. చూస్తుంటే చాలా ముద్దొస్తున్నాడు. సాయి పల్లవి మంచి టాలెంట్ వున్న నటి. ఈ సినిమాని తన భుజాలపై మోసింది2 అన్నా రు. దిల్‌రాజు మాట్లాడు తూ- ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలపడానికే ఫిదా సంబరాలను మొదలుపెట్టాం. ఇది కంటిన్యూగా సాగుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని అంటున్నారు. ఇది శేఖర్ కమ్ముల సినిమా. వరుణ్ చాలా నేచురల్‌గా నటించాడు. సాయి పల్లవి భానుమతి పాత్రలో అందరినీ ఫిదా చేసింది2అన్నారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ- ఈ సినిమా ఆత్మ తెలంగాణ బతుకమ్మ పాటలు, జానపదాలు చిన్నప్పటి నుండి వినేవాడిని. తెలంగాణ యాస, బాష అంటే చిన్నప్పటినుంచీ బాగా ఇష్టం. ఈ సినిమాకు గుండెకాయ సాయిపల్లవి. తెలంగాణ స్లాంగ్ నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ చెప్పడం మంచి విషయం. వరుణ్ చక్కగా పాత్రలో ఇమిడిపోయారు అన్నారు.