ఆది దర్శకుడిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేఖర్ మూవీస్ పతాకంపై ఆది పినిశెట్టి దర్శకత్వంలో ఎస్.చంద్రశేఖర్ రూపొందిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. రవిచంద్రన్, సమయ జంటగా నటిస్తున్న ఈ చిత్రం గూర్చి చంద్రశేఖర్ మాట్లాడుతూ- 3ఆది పినిశెట్టి చెప్పిన కథ నచ్చడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమా రూపొందిస్తున్నామని, కథ అంత బాగా వచ్చిందనీ, మిగత విషయాలు త్వరలో తెలియజేస్తామ2ని అన్నారు. సింగిల్ సిటింగ్‌లోనే ఈ చిత్రానికి కాల్షీట్లు కేటాయించడం జరిగిందని, ఓ మంచి సినిమాలో నటిస్తున్నానన్న ఆలోచన ఆనందాన్నిస్తోందని హీరోయిన్ సమయ తెలిపారు. తమిళ దర్శకుడు బాల అంటే తనకెంతో ఇష్టమని, ఆయనలా విభిన్నమైన సినిమాలు చేయాలనే ఆశతో ఈ సినిమా చేస్తున్నామని దర్శకుడు ఆది పినిశెట్టి తెలిపారు. తెలుగులో బిచ్చగాడు సంచలన విజయం సాధించినట్టుగానే ఈ చిత్రం కూడా అందరికీ నచ్చుతుందని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. కార్యక్రమంలో హీరో రవిచంద్రన్, సంగీత దర్శకుడు గౌతమ్, సాంబ, మల్లేశ్, నందకృష్ణ, రమేశ్, రాన్వ్రి తదితరులు పాల్గొన్నారు.