ఇలాక్కూడా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షారుక్, అనుష్క జంటగా ఆగస్టు 4న రాబోతున్న చిత్రం జబ్ హారీ మెట్ సెజెల్. ఇప్పటికే రెండు చిత్రాలతో హాట్ పెయిర్ అనిపించుకున్న ఈ జంట, ముచ్చటగా మూడో సినిమాతో ఆడియన్స్ జడ్జిమెంట్ కోసం రాబోతోంది. సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగావున్న షారుక్, అనుష్క, ఫ్లైట్‌లో చేస్తున్న ప్రచారాన్ని సినిమా ప్రమోషన్స్‌కు వాడుకోవడం ఒకింత ఆసక్తిదాయకం. ప్రమోషన్స్‌లో భాగంగా దుబాయ్‌కి ప్రయాణమైన ఈ జంట, విమానంలోనే 3బటర్ ఫ్లై2 స్టెప్పులేసి, ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన బటర్ ఫ్లై సాంగ్ ఎంత క్రేజ్ సృష్టించిందో తెలిసిందే. ఈ పాటకు లైట్ మూమెంట్ స్టెప్పులేసి ఆన్‌లైన్‌కు వదలడంతో లెక్కలేనన్ని లైకులు, కామెంట్లు వచ్చిపడుతున్నాయట. రబ్‌నే బనాది జోడీ, జబ్ తక్ హై చిత్రాలతో అలరించిన షారుక్, అనుష్కలు, తాజాగా జబ్ హారీ మెట్ సెజల్‌తో మరింత వినోదం పంచనున్నారు. ఇంతియాజ్ అలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో గుజరాతీ అమ్మాయిగా వైవిధ్యమైన సెజల్ పాత్రను పోషిస్తోంది అనుష్క. యూరోప్ టూర్‌కు వెళ్లిన సందర్భంలో తన నిశ్చితార్థం ఉంగరాన్ని పొగొట్టుకున్న సెజల్, ఆ రింగ్‌ని ఎలా దక్కించుకుంది, ఎలాంటి పరిణామాలు తలెత్తాయి అన్న కథా వస్తువుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గుజరాత్‌లో పుట్టి పెరిగిన అమ్మాయిగా అక్కడి సంప్రదాయాన్ని పాత్రలో ప్రదర్శించేందుకు చాలా జాగ్రత్తలే తీసుకున్నా. ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా పాత్రకు తగిన అందాన్ని, అమాయకత్వాన్ని ప్రదర్శించే విషయంలో ఒకింత కసరత్తు చేశా అంటోంది అనుష్క. ఆగస్టు 4న విడుదల కానున్న చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.