పవన్ డీల్ అదిరింది...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్ కల్యాణ్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. ఇటీవల చిత్రానికి అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందంటూ వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేసేలా తాజా చిత్రం శాటిలైట్ రైట్స్ రికార్డు అవౌంట్‌కు డీల్ కుదిరినట్టు సమాచారం. ప్రముఖ ఛానల్ జెమినీ టీవీ తెలుగు వర్షన్ శాటిలైట్ హక్కులను భారీస్థాయిలో దాదాపు 21కోట్లకు సొంతం చేసుకుంది. తెలుగు శాటిలైట్ రైట్స్ విషయంలో ఇది నాన్ బాహుబలి రికార్డ్. బాహుబలి రెండు భాగాలను మాటీవీ దాదాపు 30 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా పవన్ ,త్రివికమ్‌ల చిత్రం హిందీ శాటిలైట్ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. హిందీ హక్కులు రు.11 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. కాగా పవన్ త్రివిక్రమ్‌ల చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి.