కల్యాణ్ రామ్ కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకంపై రూపొందుతున్న కొత్త చిత్రానికి సంబంధించన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం హైదరాబాద్ రామానాయుడు స్టుడియోలో లాంఛనంగా ప్రారంభించారు. ముహుర్తం సన్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్ ఇవ్వగా శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచాన్ చేసారు. దర్శకుడు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. హరికృష్ణ సినిమా స్క్రిప్ట్‌ను, దర్శకుడు జయేంద్రకు అందించారు. ఈ సందర్భంగా మహేశ్ కోనేరు మాట్లాడుతూ ఈ కొత్త చిత్రంలో కల్యాణ్ రామ్‌ను కొత్తగా ఫ్రెష్‌గా ప్రజెంట్ చేస్తున్నామని రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ఏర్కాడులో ప్రారంభించి ఆగస్టు 7 వరకు షూటింగ్ చేస్తామని, 15నుండి సెప్టెంబర్ చివరి వరకు హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతామని తెలిపారు. అన్ని కార్యక్రమాలుపూర్తి చేసి వచ్చే ఏడాది ప్రధమార్ధంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. కల్యాణ్ రామ్‌కు రొమాంటిక్ చిత్రం చేయడం ఉద్వేగంగా వుందని ఐశ్వర్య లక్ష్మిని కథానాయికగా పరిచయం చేస్తున్నామని దర్వకుడు జయేంద్ర అన్నారు. గత 13 సంవత్సరాలుగా తాను వైవిధ్యమైన చిత్రాలు చేస్తున్నానని ఎంత వైవిధ్యంగా చేసినా అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని, అయితే ఈ కథ కొత్తగా అనిపించడంతో చేయాలనిపించిందని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. రొమాంటిక్ కామెడీ చేయాలనే కోరిక చాలా రోజులుగా వుందని, అది ఈ చిత్రంతో తీరుతుందని అన్నారు. పి.సి.శ్రీరామ్, ఐశ్వర్య లక్ష్మి, కిరణ్ ముప్పవరపు, విజయకుమార్ వట్టికూటి తదితరులు కార్యక్రమంలో పాల్గొని విశేషాలు తెలిపారు. చిత్రానికి సంగీతం శరత్, కెమెరా పిసి శ్రీరాం.