సెప్టెంబర్‌లో రానున్న లచ్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయతి తొలిసారిగా హీరోయిన్‌గా నటిస్తూ రూపొందిస్తున్న చిత్రం 3లచ్చి2. ఈశ్వర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ కామెడీ హారర్ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్ మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత, నాయిక జయతి మాట్లాడుతూ- వైవిధ్యమైన కథ, కథనాలతో థ్రిల్‌కు గురిచేసే ఈ చిత్రం అంతా లచ్చి పాత్ర చుట్టే తిరుగుతుందని, అనేక మలుపులు ప్రేక్షకులకు నచ్చుతాయని తెలిపారు. తేజస్విని, దిలీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో చంద్రమోహన్, పూర్ణిమ, శివప్రసాద్, రఘుబాబు, తా.రమేష్, ధన్‌రాజ్, షేకింగ్ శేషు, రాంప్రసాద్ తదితరులు నటించారు. కెమెరా:ఎం.వి.రఘు, మాటలు:మరుదూరి రాజా, సంగీతం:సురేష్ యువన్, పాటలు:కందికొండ, నిర్మాత:జయతి, దర్శకత్వం:ఈశ్వర్.