లవర్స్ క్లబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనీష్ చందర్, పావని, ఆర్యన్, పూర్ణి ప్రధాన తారాగణంగా ప్లాన్ బి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేయా ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ధృవశేఖర్ దర్శకత్వంలో భరత్ అవ్వారి రూపొందించిన చిత్రం 3లవ ర్స్ క్లబ్2. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదలయ్యాయి. ఈ సినిమాను ఈనెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత భరత్ అవ్వారి మాట్లాడుతూ- చిన్న చిత్రాల మనుగడకు మంచి మార్గం ఏర్పడడంతో ధైర్యంగా విడుదల చేస్తున్నామని, పక్కా ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని తెలిపారు. ప్రేమికులకు అండగా నిలబడే ఓ యువకుడి జీవితంలో అనుకోని సమస్యలు వస్తే, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఫస్ట్ టైం ఐఫోన్ టెక్నాలజీతో ఈ సినిమా చిత్రీకరించామని దర్శకుడు ధృవశేఖర్ తెలిపారు. చిత్రం భాషా, వైజాగ్ ప్రసాద్, అజయ్త్న్రం, ధీరజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:రవి నిడమర్తి, ఎడిటింగ్:కిరణ్‌కుమార్, కెమెరా:డి.వి.ఎస్.ప్రకాశ్‌రావు, పాటలు: రాంబాబు గోశాల, నిర్మాత:్భరత్ అవ్వారి, రచన, దర్శకత్వం:్ధృవశేఖర్.