ఎదురుదెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ కాజల్ అగర్వాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్, గతంలో పలు కమర్షియల్ యాడ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఓ కోకోనట్ ఆయిల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ఆమె, వారు రూపొందించిన యాడ్ ఫిలింలో నటించింది. అయితే, ఆ అగ్రిమెంట్ పూర్తయిన తరువాత కూడా వాళ్ళు తను నటించిన ప్రకటనను వాడుకుంటున్నారని, అది భావ్యం కాదని, కాంట్రాక్ట్ గడువు ముగిసినా కూడా వాళ్ళు తన ఇమేజ్‌ను వాడుకుంటున్నారని కాజల్ మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసును విచారించిన కోర్టు, సదరు కంపెనీ తరఫు లాయరు కాంట్రాక్టు ముగిసినా కూడా కాపీ రైట్ చట్టం ప్రకారం ఆ ప్రకటనను 60 ఏళ్ళపాటు వాడుకోవచ్చని తెలిపారు. ఆయన వాదన విన్న కోర్టు కాజల్ పెట్టిన పిటిషన్‌ను కొట్టివేశారు.