అందరికీ నచ్చే జయ జానకి నాయక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యపాత్రల్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న 3జయ జానకి నాయ క2 చిత్రం 11న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ- ఇందులో జానకి పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత ఎమోషన్ వున్న పాత్రను చేయగలనని నన్ను నమ్మిన బోయపాటికి థాంక్స్ అన్నారు. హీరో శ్రీనివాస్ మాట్లాడుతూ- సినిమా చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. నాకు ఇంత మంచి చిత్రాన్నిచ్చిన ఆయనకు ధన్యవాదాలు. ఇది నా సినిమా అని జీవితాంతం చెప్పుకునేలా ఉంటుంది అన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ- భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. నేను చేసిన ప్రతి సినిమాది ఒక్కో స్టైల్. అయితే ఈ సినిమా పూర్తి స్థాయి ప్రేమకథతో తెరకెక్కించాను. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా నిర్మించాడు అన్నారు.