విలన్ పాత్రకోసం భారీ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించే నెక్స్ట్ సినిమాకు సన్నాహాలు మొదలవుతున్నాయి. తమిళ సూపర్ హిట్ సినిమా ‘తానిఒరువన్’ సినిమా రీమేక్‌లో చరణ్ నటిస్తున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఇప్పటికే తమిళంలో ఈ పాత్రలో అరవింద్‌స్వామి నటించి ఆకట్టుకున్నాడు. అయితే ఈ పాత్రలో ఎవరు నటిస్తారా అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురి పేర్లు వినిపించినప్పటికీ చరణ్ ఈ పాత్రలో అరవింద్‌స్వామి అయితేనే బెస్ట్ అని భావించి అతనితో చర్చలు కూడా జరుపుతున్నాడట. అన్నట్టు ఈ పాత్రకోసం చరణ్ అరవింద్‌స్వామికి ఐదు కోట్ల పారితోషికం ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అయితే అరవింద్‌స్వామి మాత్రం ఇంకా ఏ విషయం ఫైనల్ చెయ్యలేదు. ఇలా ఓ సినిమాకోసం విలన్‌కు ఇంత మొత్తం ఇవ్వడం నిజంగా విశేషమనే చెప్పాలి.