బాహుబలి కామిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం ‘బాహుబలి’.
రాజవౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు బాహుబలికి సీక్వెల్‌గా ‘బాహుబలి-2’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ‘బాహుబలి’ సరికొత్తరూపంలో ఇంటిల్లిపాదినీ అలరించేందుకు
సరికొత్తరూపంలో దర్శనమివ్వనున్నాడు. బాహుబలి కథ ఆధారంగా ఇకముందు యానిమేషన్, గేమ్స్, కామిక్స్ వంటివి రూపొందనున్నాయి. ఇప్పటికే బాహుబలి కామిక్ అతిత్వరలో మార్కెట్‌లోకి విడుదల కానుంది. ‘బాహుబలి’ చిత్రాన్ని
నిర్మించిన ఆర్కా మీడియా బ్యానర్, ప్రఖ్యాత గ్రాఫిక్ డిజైనింగ్ సంస్థ ‘గ్రాఫిక్ ఇండియా’ కలిసి ఈ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బుధవారంనాడు ‘బాహుబలి’ కామిక్ పోస్టర్‌ను రాజవౌళి, గ్రాఫిక్ ఇండియా ప్రతినిధి ఆవిష్కరించారు.
దానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇదే!