గ్యాంగ్‌స్టర్‌గా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం రాజుగారి గది 2లో నటిస్తున్న నాగార్జున తాజాగా మరో భిన్నమైన సినిమాలో నటించేందుకు సిద్ధం అయ్యాడు ఈసారి ఆయన గ్యాంగ్‌స్టర్ గా కనిపించనున్నాడని తెలిసింది. వివరాల్లోకి వెడితే లేటెస్గుగా తమిళంలో హిట్ చిత్రంగా నిలిచిన విక్రమ్‌వేద సినిమా మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఇందులో మాధవన్, విజయ్‌సేతుపతి నటించారు. మాధవన్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా కనిపిస్తే విజయ్ సేతుపతి గాంగ్‌స్టర్‌గా అద్భుతంగా నటించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి నిర్మాత శశికాంత్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ పాత్రపై నాగార్జున ఆసక్తి చూపించాడని టాక్. అయితే మాధవన్ పాత్రకోసం ముందుగా వెంకటేష్‌ని అడిగితే నో చెప్పాడట! దాంతో నాగార్జునతోపాటు మరో హీరోను తీసుకునే సన్నాహాలు జరుగుతున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరం భిన్నమైన సినిమాలతో దూసుకుపోతున్న నాగార్జున చేసే మరో భిన్నమైన సినిమాగా ఇది నిలుస్తుంది.