మహానుభావుడు చించేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్, మెహరిన్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మహానుభావుడు. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈ నెల 24న విడుదల చేసారు. టీజర్‌కు దాదాపు అరకోటి డిజిటల్ వ్యూస్ లభించాయని నిర్మాతలు తెలియజేస్తున్నారు. ఇంకా వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో విపరీతైన క్రేజ్‌ను మహానుభావుడు టీజర్ రాబట్టిందని, అతి శుభ్రం నీట్‌నెస్ అంటూ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. మేకింగ్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా ఇటలీ, ఆస్ట్రియా, క్రోయేషియా లాంటి విదేశాల్లోను, పొల్లాచి, ఆర్‌ఎఫ్‌సి, హైదరాబాద్‌లో అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ చేసామని ఒక పాట మినహా పూర్తయిన ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విజయదశమికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. టీజర్ అందుకున్న విజయమే సినిమా కూడా అందుకుంటుందని నమ్మకం వుందని వారు తెలిపారు. వెనె్నల కిషోర్, నాజర్, భద్రం, కల్యాణి నటరాజ్, పిజ్జ్భుయ్, భాను, హిమజ, వేణు, సుదర్శన్, సాయి, వెంకీ, శంకర్‌రావు, రమాదేవి, మధుమణి, రాగిణి, రజిత, సుభాష్, ఆర్‌కె తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌ఎస్ తమన్, కెమెరా: నిజార్ షఫి, కథ, మాటలు,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.