సొంత గొంతు సులువు కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పితృస్వామ్య ఆలోచనలు పరిశ్రమలోనే కాదు, ప్రపంచాన్నీ వెంటాడుతున్నాయి. అందుకే -రీల్ లైఫ్‌లోని కొన్ని పాత్రల్ని రియల్ లైఫ్‌లో కొనసాగించలేని పరిస్థితి ఉంది. నటిగా పరిశ్రమలో సొంత గొంతు వినిపించటం అంత సులువేం కాదు’ అంటోంది హీరోయిన్ తాప్సి. ‘పింక్’, ‘నామ్ షబానా’ చిత్రాల్లో ప్రాధాన్యత కలిగిన పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలందుకున్న 30ఏళ్ల తాప్సీ ‘జుమ్మంది నాదం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ముంబైలో పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనసులో మాట పంచుకుంది. ‘కొన్ని సినిమాలు, పాత్రలకు సంబంధించి ఆలోచనలు రేకెత్తినపుడు -నన్ను నేను ప్రశ్నించుకుంటా. ఆత్మగౌరవం విషయంలో రాజీ పడుతున్నానా? లేక వృత్తిపరమైన ఎదుగుదలకు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నానా? అని. అలాంటి సందిగ్ధ స్థితిలో తెలివైన నిర్ణయాలే కెరీర్‌కు ఉపకరిస్తాయి’ అంటోంది ఢిల్లీ బ్యూటీ. ‘పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిశ్రమలో ఫిమేల్ ఆర్టిస్ట్‌లు తమ అభిప్రాయాలు విస్పష్టంగా చెప్పడానికి సాహసిస్తున్నారు. ఈ మార్పును ఆనందించాలి’ అంటోంది తాప్సి. ‘నిజానికి పరిశ్రమలో మహిళల వాయిస్‌కు విలువ ఉండదని, కానీ, ఇప్పుడు చాలామంది నటీమణులు కొన్ని సందర్భాల్లో సొంత గొంతు వినిపిస్తున్నారని వివరించింది. ‘నిలదీసే తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ అడుగులు ఎంతదూరం, ఎంతబలంగా పడతాయో తెలీదుకానీ, మార్పు అనివార్యమని అర్థమైంది’ అంటోంది తాప్సి. మహిళల నుంచి వినిపిస్తున్న స్పష్టమైన స్వరం ప్రజల ఆలోచనల్లో మార్పు తెస్తుందని, మేం ఏం చెప్పాలనుకుంటున్నామో వినేందుకు సిద్ధమవుతున్నారని తాప్సి అంది. ‘సినిమాకు సంబంధించి స్క్రీన్ మీదే కాదు, బయటా హీరోయిన్ పాత్ర గతంకంటే ఎక్కువైంది. ప్రీ ప్రొడక్షన్ నుంచి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ వరకూ యాక్టివ్‌గానే ఉంటున్నాం’ అని చెప్పుకొచ్చింది. విడుదలకు సిద్ధమైన రొమాంటిక్ కామెడీ ‘జుడ్వా-2’పై ఆశలు పెట్టుకున్న తాప్సి, కమర్షియల్, నాన్ కమర్షియల్ చిత్రాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పింది. దక్షిణాది పరిశ్రమలో సంపాదించుకున్న అనుభవంతో బాలీవుడ్‌లో తప్పులు చేయడం లేదు. ఏమో కొత్త తప్పులు చేస్తానేమో. అయినా, భయం లేదు. ఎందుకంటే వాటితో కొత్త పాఠాలు నేర్చుకుంటా’ అంటోంది తాప్సి. నటుడు రిషీకఫూర్ జీవిత కథతో అనుభవ్ సిన్హా రూపొందించనున్న ‘ముల్క్’ సెట్స్ మీదకు వెళ్తున్న తరుణంలో, రిషీ కోడలి పాత్రలో కనిపించేందుకు తాప్సి సన్నద్ధమవుతోంది.