ఐటెం సాంగ్‌లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య అందాల భామ తమన్నాకు కెరీర్‌కు కాస్త బ్రేక్ పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభినేత్రి భారీ పరాజయం పాలవ్వడంతో తమన్నాకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఒకే ఒక్క తమిళ చిత్రంలో నటిస్తున్న ఈ మిల్కీ భామకు తెలుగులో క్రేజీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే కళ్యాణ్‌రామ్ సరసన ఓ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన తమన్నా, మరోవైపు ఎన్టీఆర్ నటిస్తున్న జైలవకుశ సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు రెడీ అయ్యిందట. బాబి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న జైలవకుశ చిత్రంలో మూడు పాత్రల్లో అలరించనున్నాడు ఎన్టీఆర్. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందని, ఆ పాటను తమన్నాతో చేయాలని దర్శక నిర్మాతలు భావించారట. ఇంతకుముందు జనతా గ్యారేజ్‌లో పక్కా లోకల్ అంటూ కాజల్ ఆడి పాడిన పాట సంచలన విజయం సాధించడంతో ఆ సెంటిమెంట్‌ను జైలవకుశకు వర్కవుట్ చేస్తున్నారు. ఇప్పటికే తమన్నాతో చర్చలు జరిపారని, త్వరలోనే ఈ పాట తెరకెక్కించనున్నారట. తమన్నా ఇంతకుముందు అల్లుడు శీను చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. మరి జైలవకుశకు తమన్నా సపోర్టు తీసుకుంటున్నారన్నమాట.