కోటి లైక్స్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో యువనటుడు అల్లు అర్జున్‌కు వున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. కమర్షియల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మరో క్రేజీ రికార్డును స్వంతం చేసుకున్నాడు. ఫేస్‌బుక్‌లో అల్లును లైక్‌చేసిన వారి సంఖ్య కోటిదాటింది. ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం లేకుండా స్టార్ సెలబ్రిటీలు వుండడం లేదు. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు కూడా. ఫేస్‌బుక్‌లో టాలీవుడ్‌కు చెందిన హీరోలందరూ కూడా వున్నారు. ఈ లిస్టులో వున్న అల్లు అర్జున్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ కోటి దాటింది. దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఏ హీరోకి లేని ఫాలోయింగ్ అల్లు అర్జున్‌కి దక్కడం విశేషం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సరైనోడు’ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది.