ఉంగరాల కామెడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, మియాజార్జి జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై పరచూరి కిరీటి నిర్మించిన ఉంగరాల రాంబాబు ఈ నెల 15న విడుదలవుతున్న సందర్భంగా ఆదివారం పరిశ్రమలో వున్న కమెడియన్లందరితో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ కమెడియన్లు అందర్నీ నవ్విస్తారని అనుకుంటారు కానీ మా వెనక కూడా చాలా కష్టాలుంటాయి, ఉంగరాల రాంబాబు ట్రైలర్‌లో డైలాగులు విన్నాక ముప్ఫై ఏళ్ల క్రితం నేను చెన్నైలో వున్నప్పటి పరిస్థితులు గుర్తుకొచ్చాయి. సునీల్‌లోని మరో కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని అన్నారు. ఆలీ మాట్లాడుతూ ఏ పరిశ్రమలోనైనా కమెడియన్లకు కలసి వుండడం తెలియదు. ఎంతమంది వున్నా ఎంత పోటీ వున్నా తెలుగు పరిశ్రమలో మాత్రమే ఒక కుటుంబంగా వుండగలం, ఆ గౌరవం ఒక్క తెలుగు పరిశ్రమకే దక్కింది. సునీల్ నాలుగేళ్ల క్రితం కష్టపడి చేసిన సిక్స్‌పాక్ అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అతను ఏదైనా చేయగలడని నిరూపించుకున్నాడు అన్నారు. సునీల్ మాట్లాడుతూ చేసుకున్న కర్మను అనుభవించే వారిని నవ్వించడమే మేం చేయాల్సిన పని. ఈ మంచిపని భవిష్యత్తులో మా పిల్లలకు మంచి చేస్తుందని కోరిక.