మెంటల్ మదిలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లి చూపులు వంటి ఘన విజయం తర్వాత నిర్మాత రాజ్‌ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం మెంటల్ మదిలో. వివేక్ ఆత్రేయ దర్శకుడు. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మాజిక్ జరుగుతుంది. ఆ మేజిక్ జరగడానికి సపోర్టు అవసరం. అలాంటి సపోర్టును సురేష్‌బాబు ఇస్తున్నారు. ఆయన సినిమా చూసి కొన్ని మార్పులు చెప్పారు. ఎందుకంటే ప్రేక్షకుల నాడి ఏమిటో తెలిసిన వ్యక్తి ఆయన. వివేక్ ఇంతకు ముందు షార్ట్ ఫిలిం చేసేవాడు. ఈ కథ బాగా నచ్చింది. అందుకే సినిమా చేస్తున్నాం. ఈ సినిమా ద్వారా మంచి టెక్నీషియన్లు పరిచయం అవతున్నారు అన్నారు. ఈ సినిమా కూడా ఆయన సపోర్టు అందిస్తున్నారంటే తప్పకుండా మంచి సినిమా అవుతుంది అన్నారు.