ఆ విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో సునీత, రాజ్‌కుమార్ సం యుక్తంగా రూపొందించిన చితం శ్రీవల్లీ. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనె ల 15న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ చిత్ర విశేషాలను తెలిపారు. తన చిన్ననాటి స్నేహితులు, ఎంతో సాయం చేశాడని, అతనికి తిరిగి సాయం చేయాలని వెళితే, అతను చనిపోయాడన్న విషయం తెలిసిందనీ, ఆ విషాద సంఘటనలనుండే ఈ శ్రీవల్లీ కథ పుట్టింది అన్నారు. నిర్మాతలు కొత్త కథ కావాలి అనడంతో ఈ కథను ఎంపిక చేసుకున్నానని, మనసు తరంగాలవంటిదైతే, మన ఆలోచనలు ఎదుటివారికి చేరడం, వారి ఆలోచనలు తిరిగి తరంగాల రూపంలో మనకు చేరడం జరుగుతాయని, ఈ కథనానికి నాటకీయత జోడించి ఈ చిత్రాన్ని రూపొందించానని ఆయన అన్నా రు. ఒక అమ్మాయి మనసుపై ప్రయోగం జరిగే సమయంలో ఆమె గత జన్మ స్మృతుల్లోకి వెళితే ఎటువంటి గందరగోళ పరిస్థితి ఎదురవుతుంది అనే కథనంతో ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని అన్నారు. కథ వైవిధ్యంగా వున్నా దానిచుట్టూ తిరిగే అంశాలు ప్రేక్షకుడికి బాగా అర్థమయ్యేలా చిత్రీకరించామని ఆయన తెలిపారు. తరువాత వచ్చే సన్నివేశం ఏం టో ఎవరూ ఊహించలేని విధంగా వుంటుందని, బాహుబలి తరువాత తనలో ఎటువంటి మార్పు రాలేదని ఆయన తెలిపారు. త్వరలో మహాభారతం తీయాలనే తన కల నెరవేరుతుందని, దాని కి ముందుగా బాహుబలి చిత్రాన్ని రూపొందించామని, తెలుగు హిందీలలో ఒక్కో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నానని వివరించారు. నుండే కథ