తక్కువ సమయంలో.. ఎక్కువ చిత్రాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో పలు చిత్రాలు నిర్మించిన నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణకు తెలుగు సినిమా వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. ఈ సందర్భంగా తమిళనాడు గవర్నర్ రోశయ్య ఆయనను సన్మానించి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. 2004లో సుమన్, రవళి జంటగా ఎస్.పి.సింహ సినిమాతో నిర్మాతగా మారిన రామసత్యనారాయణ, తాజాగా విడుదలైన పూర్ణ ‘అవంతిక’ సినిమాతో 12 ఏళ్ళలో 92 చిత్రాలను నిర్మించి సంచలనం సృష్టించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘తక్కువ సమయంలో ఇన్ని చిత్రాలను నిర్మించే ప్రోత్సాహాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు, సాంకేతిక నిపుణులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. వీరి ప్రోత్సాహం ఇలాగే పదికాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నాను. కథాబలం వున్న సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయని తెలుగు ప్రేక్షకులు నిరూపిస్తూనే వున్నారు. అదే తరహాలో మంచి కథలతో, ప్రేక్షకులు మెచ్చేరీతిలో మా బ్యానర్ నుంచి చిత్రాలు వస్తాయ. నిర్మాతగా పరిశ్రమ కూడా అన్ని విధాలు ఎప్పటికప్పుడూ అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తూనే వుంది. అందుకు నేను పరిశ్రమకు ఎంతో రుణపడివున్నాను’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు.